బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలుగు వారికి పెద్దపీట
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలుగు వారికి పెద్దపీట వేశారు. బీజేపీ జాతీయ నూతన కార్యవర్గాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ప్రకటించారు. జాతీయ ఎగ్జిక్యూటివ్కమిటీలో తెలంగాణ నుంచి కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్, గరికపాటి మోహన్‌రావుకు చోటు దక్కింది. ఆఫీస్ బేరర్లలో విజయశాంతి, ఈటల రాజేందర్ కు స్థానం కల్పించారు. బీజేపీ స్టార్‌క్యాంపెయినర్ల జాబితా సిద్ధం హుజురాబాద్ఉప ఎన్నికలకు సంబంధించి స్టార్‌క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ సిద్ధం […]
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలుగు వారికి పెద్దపీట వేశారు. బీజేపీ జాతీయ నూతన కార్యవర్గాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ప్రకటించారు. జాతీయ ఎగ్జిక్యూటివ్కమిటీలో తెలంగాణ నుంచి కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్, గరికపాటి మోహన్‌రావుకు చోటు దక్కింది. ఆఫీస్ బేరర్లలో విజయశాంతి, ఈటల రాజేందర్ కు స్థానం కల్పించారు.
బీజేపీ స్టార్‌క్యాంపెయినర్ల జాబితా సిద్ధం
హుజురాబాద్ఉప ఎన్నికలకు సంబంధించి స్టార్‌క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ సిద్ధం చేసింది. 20 మందితో కూడిన ఈ జాబితాను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి గురువారం ప్రకటించారు. తనతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి మురళీధర్‌రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్‌వెంకటస్వామి, విజయశాంతి, చాడ సురేశ్‌రెడ్డి, రమేశ్‌రాథోడ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కూన శ్రీశైలం గౌడ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఉన్నట్లుగా ఆయన ప్రకటించారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.