వ్యభిచారానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఆ బీచ్.. గంటకు రూ.1000 చొప్పున

దిశ, వెబ్‌డెస్క్: మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వ్యభిచారానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతూ నిత్యం పిల్లల కేరింతలతో కళకళలాడుతుండాల్సిన బీచ్ యువతీయువకుల రాసలీలలకు అడ్డాగా మారింది. మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి యువతీయువకులు నిత్యం బీచ్‌ సందర్శనకు వచ్చి తమ రాసలీలలు సాగించడం, పక్కనే ఉన్న రిసార్ట్ లకు వెళ్లి ఎంజాయ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కుటుంబాలతో వచ్చేవారికి ఇబ్బంది ఎదురవుతుంది. ఇంకా చెప్పాలంటే అచ్చంగా వ్యభిచారం చేసే మహిళలే […]

Update: 2021-08-04 22:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వ్యభిచారానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతూ నిత్యం పిల్లల కేరింతలతో కళకళలాడుతుండాల్సిన బీచ్ యువతీయువకుల రాసలీలలకు అడ్డాగా మారింది. మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి యువతీయువకులు నిత్యం బీచ్‌ సందర్శనకు వచ్చి తమ రాసలీలలు సాగించడం, పక్కనే ఉన్న రిసార్ట్ లకు వెళ్లి ఎంజాయ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కుటుంబాలతో వచ్చేవారికి ఇబ్బంది ఎదురవుతుంది. ఇంకా చెప్పాలంటే అచ్చంగా వ్యభిచారం చేసే మహిళలే నిత్యం పదుల సంఖ్యలో రిసార్ట్‌లకు చేరుతున్నట్లు అక్కడివారు చెప్తున్నారు. ఇక తాజాగా ఈ వ్యభిచార జంటల గుట్టురట్టు చేశారు బందర్ పోలీసులు.

బీచ్ కు వచ్చి వ్యభిచారం నడుపుతున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం బీచ్ లోని రిసార్ట్ లపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఎనిమిది జంటలు రూమ్ లలో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. వారందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు రిస్టార్ ఓనర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు గంటకు రూ.1000 చొప్పున వ్యభిచారానికి రూమ్ లను అద్దెకు ఇస్తూ ఓనర్ సొమ్ము చేసుకుంటన్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఇక ఈ ఆకస్మిక దాడులు జరిగేసరికి పాలుపోని జంటలు రూమ్ ల నుంచి బయటికి వచ్చి పరుగు లంకించుకున్నారు. కొంతమంది పక్కనే ఉన్న చెట్ల పొదలలో దాక్కున్నారు. అనుమానాస్పదంగా చిక్కిన ఎనిమిది జంటలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిలో కొంతమంది ప్రముఖులు, మరి కొందరు ప్రజాప్రతినిధుల వద్ద పనిచేసేవారని గుర్తించారు.

Tags:    

Similar News