తెలంగాణ సంగతి సరే.. మరి ఏపీ సంగతి ఏంటి?
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా మళ్ళీ కట్టలు తెంచుకుంది. తగ్గు ముఖం పెట్టినట్లే పట్టి మళ్ళీ విజృంభిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలపై కరోనా ప్రభావం ఎక్కువ చూపుతుంది. ఇప్పటికే తెలంగాణలో విద్య సంస్థలు బంద్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఆంద్రప్రదేశ్ విద్యా సంస్థల సంగతేంటి? ఏపీ లోని పలు పాఠశాలలో ఇప్పటికే విద్యార్థులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. […]
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా మళ్ళీ కట్టలు తెంచుకుంది. తగ్గు ముఖం పెట్టినట్లే పట్టి మళ్ళీ విజృంభిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలపై కరోనా ప్రభావం ఎక్కువ చూపుతుంది. ఇప్పటికే తెలంగాణలో విద్య సంస్థలు బంద్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఆంద్రప్రదేశ్ విద్యా సంస్థల సంగతేంటి? ఏపీ లోని పలు పాఠశాలలో ఇప్పటికే విద్యార్థులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ లో యధావిధిగా విద్యాసంస్థలు నడుస్తున్నాయి.
ఒక పక్క చాప కింద నీరులా కరోనా విస్తరిస్తుంటే ఇంకా విద్యార్థుల జీవితాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది అంటూ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా స్కూల్స్ లో కరోనా నియమాలను కూడా ఎవరు పాటించడంలేదు. దీంతో విద్యార్థులు ఒక పక్క, తల్లిదండ్రులు మరోపక్క భయాందోళనలకు గురవుతున్నారు. మరి ఇకనైనా ఏపీ ప్రభుత్వం కరోనాను అరికట్టే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోనుందో వేచి చూడాలి.