Breaking: కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ లే అవుట్ల నిర్మాణాల్లో పేదల ఇళ్లకు 5 శాతం భూమిని ఇవ్వాలంటూ ఏపీ పురపాలక శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేదలకు ఇచ్చే అట్టి భూమిని ఆయా జిల్లాల కలెక్టర్లలకు అప్పగించాలని ఆదేశించింది. ప్రైవేట్ లే అవుట్లలో భూమిని ఇవ్వలేని పరిస్థితి ఉంటే, దానికి మూడు కిలోమీటర్ల పరిధిలో భూమిని కొనివ్వాలని నిబంధనలు విధించింది. లే అవుట్లలో తీసుకున్న ఐదుశాతం భూమిని ‘‘జగనన్న […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ లే అవుట్ల నిర్మాణాల్లో పేదల ఇళ్లకు 5 శాతం భూమిని ఇవ్వాలంటూ ఏపీ పురపాలక శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేదలకు ఇచ్చే అట్టి భూమిని ఆయా జిల్లాల కలెక్టర్లలకు అప్పగించాలని ఆదేశించింది. ప్రైవేట్ లే అవుట్లలో భూమిని ఇవ్వలేని పరిస్థితి ఉంటే, దానికి మూడు కిలోమీటర్ల పరిధిలో భూమిని కొనివ్వాలని నిబంధనలు విధించింది. లే అవుట్లలో తీసుకున్న ఐదుశాతం భూమిని ‘‘జగనన్న కాలనీల’’ ద్వారా పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూమి ఇవ్వలేని పరిస్థితి ఉంటే, అట్టి భూమి విలువను చెల్లించాలని సూచనలు చేసింది.