‘నల్ల చట్టాల రద్దు రైతుల అతి గొప్ప విజయం’
దిశ, పరకాల: మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం రైతాంగ విజయమని తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల రాజేశంలు అన్నారు. సుదీర్ఘకాలం ప్రభుత్వంపై పోరాడి సాధించిన అతి గొప్ప విజయమని విశ్లేషించారు. స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రజా భాగస్వామ్యంతో జరిగిన ఈ ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ, రక్తం చిందిస్తూ, రైతులు, కార్మికులు, […]
దిశ, పరకాల: మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం రైతాంగ విజయమని తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల రాజేశంలు అన్నారు. సుదీర్ఘకాలం ప్రభుత్వంపై పోరాడి సాధించిన అతి గొప్ప విజయమని విశ్లేషించారు. స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రజా భాగస్వామ్యంతో జరిగిన ఈ ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ, రక్తం చిందిస్తూ, రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు పోరాడారని కొనియాడారు. దాని ఫలితమే నల్లచట్టాల రద్దు సాధ్యమైందన్నారు. ఈ పోరాటం భవిష్యత్తులో నిర్వహించే ఉద్యమాలకు స్పూర్తిదాయకమని సతీష్ రెడ్డి,రాజేశంలు అన్నారు.