లాక్‌డౌన్ ముగిసిన రెండు వారాల తరువాత పది పరీక్షలు: సురేష్

లాక్‌డౌన్ ముగిసిన అనంతరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలు లాక్‌డౌన్ ముగిసిన రెండు వారాల తరువాత నిర్వహిస్తామని అన్నారు. సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని అన్నారు. అలాగే నూతన విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాలెడర్‌ను కూడా […]

Update: 2020-04-28 23:57 GMT
లాక్‌డౌన్ ముగిసిన రెండు వారాల తరువాత పది పరీక్షలు: సురేష్
  • whatsapp icon

లాక్‌డౌన్ ముగిసిన అనంతరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలు లాక్‌డౌన్ ముగిసిన రెండు వారాల తరువాత నిర్వహిస్తామని అన్నారు. సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని అన్నారు. అలాగే నూతన విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాలెడర్‌ను కూడా విడుదల చేస్తామని చెప్పారు.

Tags: adimulapu suresh, education, ap, 10th exams, education department

Tags:    

Similar News