మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలుచోట్ల టెన్షన్ వాతావరణం
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతిలోని 15వ వార్డు మహాత్మాగాంధీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ మద్దతుదారులను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించిన పోలీసులు.. టీడీపీ మద్దతుదారులను అనుమతించకలేదు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చేటుచేసుకోగా.. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో నూకలపాలెం గ్రామస్తులు తమ గ్రామాన్ని […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతిలోని 15వ వార్డు మహాత్మాగాంధీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ మద్దతుదారులను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించిన పోలీసులు.. టీడీపీ మద్దతుదారులను అనుమతించకలేదు.
దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చేటుచేసుకోగా.. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో నూకలపాలెం గ్రామస్తులు తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయాలంటూ ఓటింగ్‌ను బహిష్కరించారు.
ఇక గుంటూరులోని 54వ డివిజన్‌లో పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ అభ్యర్థులను అనుమతించారంటూ టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పిచ్చులకుంట వద్ద వైసీపీ నాయకులు దూషించారని బీజేపీ అభ్యర్థి ఆందోళన చేపట్టారు. అలాగే గుంటూరులోని సంజీవ నగర్ పోలింగ్ కేంద్రంలో గుర్తింపు లేకుండా వైసీపీ నాయకులు తెస్తున్నారంటూ పోలీసులు అడ్డుకోగా.. వైసీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.