కార్మికుడి మృతదేహంతో ఆందోళన

దిశ, వెబ్‌డెస్క్: కార్మికుడి ఆకస్మిక మరణంతో ఆ కర్మాగారం అట్టుడికిపోయింది. తోటి కార్మికుడు పని చేస్తూ ప్రాణాలు వదిలాడంటూ ఆందోళనకు దిగారు. హాస్పిటల్ తీసుకెళ్లిన ప్రాణాలు కాపాడలేదని ఏకంగా మృతదేహంతో ధర్నా చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలోని మహీంద్రా ట్రాక్టర్ ప్లాట్‌లో పని చేస్తున్న కార్మికుడు ఆకస్మికంగా కుప్పకూలాడు. ఆస్పత్రికి చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తోంది. దీంతో శవంతోనే తోటి కార్మికులు సర్కార్ దావఖానా ముందు ఆందోళనకు దిగారు. చనిపోయిన వ్యక్తి జహీరాబాద్ మండలం కాసింపూర్‌కు చెందిన హుస్సేన్‌గా […]

Update: 2020-10-08 05:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: కార్మికుడి ఆకస్మిక మరణంతో ఆ కర్మాగారం అట్టుడికిపోయింది. తోటి కార్మికుడు పని చేస్తూ ప్రాణాలు వదిలాడంటూ ఆందోళనకు దిగారు. హాస్పిటల్ తీసుకెళ్లిన ప్రాణాలు కాపాడలేదని ఏకంగా మృతదేహంతో ధర్నా చేపట్టారు.

సంగారెడ్డి జిల్లాలోని మహీంద్రా ట్రాక్టర్ ప్లాట్‌లో పని చేస్తున్న కార్మికుడు ఆకస్మికంగా కుప్పకూలాడు. ఆస్పత్రికి చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తోంది. దీంతో శవంతోనే తోటి కార్మికులు సర్కార్ దావఖానా ముందు ఆందోళనకు దిగారు. చనిపోయిన వ్యక్తి జహీరాబాద్ మండలం కాసింపూర్‌కు చెందిన హుస్సేన్‌గా (45) గా గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి దర్యాప్తు చేస్తున్నారు. దీని పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News