కర్నూలులో ఉద్రిక్తత
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లాలోని గడివేముల మండలం పెసరవాయిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పోలీంగ్ కేంద్రంలోకి వృద్దులను తీసుకు వెళ్లే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మాటా మాట పెరగడంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. కాగా పరిస్థితి ఉద్రిక్తతగా మారుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలకు పోలీసులు చెదరగొట్టారు.