చిత్తూరులో టీడీపీ, వైసీపీ మధ్య ఉద్రిక్తత

దిశ, ఏపీ బ్యూరో: నంద్యాలలో ముస్లిం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై బుధవారం చిత్తూరు నగరంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. నగర అధ్యక్షుడు కటారి ప్రవీణ్, మాజీ ఉప మేయర్​ సుబ్రహ్మణ్యం ఇతర కార్యకర్తలతో ఆందోళనలో పాల్గొన్నారు. ఇదే సమయంలో వైసీపీ నాయకులు హుస్సేన్ ​అలీషా, దాడి మున్నా, అఫ్జల్​ఖాన్​ టీడీపీకి వ్యతిరేకంగా కార్యకర్తలతో పోటీగా బైఠాయించారు. చంద్రబాబు ముస్లిం ద్రోహి అంటూ నినాదాలు చేశారు. సలాం కుటుంబాన్ని వేధించిన పోలీసులకు టీడీపీ వాళ్లే బెయిలు […]

Update: 2020-11-11 11:06 GMT
చిత్తూరులో టీడీపీ, వైసీపీ మధ్య ఉద్రిక్తత
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: నంద్యాలలో ముస్లిం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై బుధవారం చిత్తూరు నగరంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. నగర అధ్యక్షుడు కటారి ప్రవీణ్, మాజీ ఉప మేయర్​ సుబ్రహ్మణ్యం ఇతర కార్యకర్తలతో ఆందోళనలో పాల్గొన్నారు. ఇదే సమయంలో వైసీపీ నాయకులు హుస్సేన్ ​అలీషా, దాడి మున్నా, అఫ్జల్​ఖాన్​ టీడీపీకి వ్యతిరేకంగా కార్యకర్తలతో పోటీగా బైఠాయించారు. చంద్రబాబు ముస్లిం ద్రోహి అంటూ నినాదాలు చేశారు. సలాం కుటుంబాన్ని వేధించిన పోలీసులకు టీడీపీ వాళ్లే బెయిలు తెప్పించి ఇప్పుడు ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరు పక్షాలను అక్కడి నుంచి పంపించేశారు.

Tags:    

Similar News