‘మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దు’
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా రాష్ర్టంలో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణశాఖ రెడ్అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్టు పేర్కొంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రెడ్ వార్నింగ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ […]
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా రాష్ర్టంలో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణశాఖ రెడ్అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్టు పేర్కొంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రెడ్ వార్నింగ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ వార్నింగ్‌ను జారీ చేసినట్టు వాతావరణ శాఖ రీజినల్ అధికారి కుల్దీప్ శ్రీవాత్సవ ప్రకటించారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయని, 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.