తెలంగాణలో ప్రతి కుటుంబంపై రూ.4లక్షల భారం: షర్మిల

దిశ, కామేపల్లి: సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి- Latest Telugu News

Update: 2022-04-10 16:30 GMT
తెలంగాణలో ప్రతి కుటుంబంపై రూ.4లక్షల భారం: షర్మిల
  • whatsapp icon

దిశ, కామేపల్లి: సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చారని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఆదివారం ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా కామేపల్లి మండలం బర్లగూడెం, పొన్నెకల్ గ్రామాలలో మాటముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ తెస్తానని చెప్పిన కేసీఆర్.. రాష్ట్రాన్ని బీరు, బార్ల తెలంగాణగా మార్చారని ధ్వజ మెత్తారు.

ప్రభుత్వం తెచ్చిన అప్పులతో ప్రతి కుటుంబంపై రూ.4 లక్షల భారం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పులు, ఆత్మహత్యల తెలంగాణగా మారిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో 46 లక్షల పక్కా ఇల్లు నిర్మిస్తే.. కేసీఆర్ ఒక్క ఇంటిని కూడా నిర్మించి ఇవ్వలేదని ఆరోపించింది. ఉద్యమకారుడని కేసీఆర్‌కు అవకాశం ఇస్తే దోపిడీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గం ఇంచార్జ్ భానోత్ సుజాత మంగీలాల్, పార్టీ నేతలు గుండ్ల రమేష్, రెడబోత్ సత్తిరెడ్డి, ఎస్ కె.ఫయ్యాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News