మనిషి తల కన్నా పెద్ద ఆకారంలో లిల్లీ పుష్పాలు..
దిశ, ఫీచర్స్ : మనిషి తల కంటే పెద్దవిగా ఉండే నీటి కలువ జాతికి చెందిన కొత్త పుష్పాలను పరిశోధకులు గుర్తించారు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : మనిషి తల కంటే పెద్దవిగా ఉండే నీటి కలువ జాతికి చెందిన కొత్త పుష్పాలను పరిశోధకులు గుర్తించారు. వాటి మొగ్గలు 3.2 మీటర్ల వెడల్పు ఉన్నట్లుగా గుర్తించారు. బొలివియన్ సంస్థలు 'శాంటా క్రూజ్ డి లా సియెర్రా బొటానిక్ గార్డెన్, లా రింకోనాడా గార్డెన్స్' తాము సేకరించిన జెయింట్ వాటర్ లిల్లీ సీడ్స్‌ను 2016లో క్యూ గార్డెన్స్‌కు అందించాయి. కాగా అవి పెరుగుతున్న క్రమంలో సాధారణ కలువ జాతుల కంటే భిన్నంగా ఉన్నట్లు ఆ గార్డెన్ హార్టికల్చరిస్ట్ గమనించాడు.
2019లో సదరు హార్టికల్చరిస్ట్ బొలివియాను సందర్శించి, అడవిలోని నీటి లిల్లీలను(V. బొలివియానా) చూశాడు. ఇవి ఈశాన్య బొలివియాలోని మంచినీటి నదులు, వరద మైదానాలు, చెరువుల్లో పెరుగుతున్నాయి. వీటి భారీ సైజుకు సంబంధించి సరైన కారణం తెలియనప్పటికీ, సూర్యరశ్మిని ఎక్కువగా పొందడం వల్లే ఇలా ఉండవచ్చని గతంలో కొన్ని అధ్యయనాలు సూచించాయి. ఈ నేపథ్యంలో యూకేలోని క్యూ గార్డెన్స్‌కు చెందిన నటాలియా ప్రిలోమ్‌స్కా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. 'ఉష్ణమండలంలో జీవవైవిధ్యం చాలా ఎక్కువ. వరదల కారణంగా నదులు అకస్మాత్తుగా పెద్దవిగా మారినపుడు అక్కడ వాటర్ లిల్లీస్ వృద్ధి చెందుతాయి. అవి చాలా త్వరగా పెరగడంతో పాటు సూర్యరశ్మిని అధికంగా సంగ్రహిస్తూ ఇతర మొక్కలతో పోటీపడతాయి' అన్నారు.
4 బిలియన్లకు పైగా బేస్ జతలను కలిగి ఉన్న విక్టోరియా క్రూజియానా, విక్టోరియా అమెజోనికా వంటి జెయింట్ వాటర్ లిల్లీ జాతుల జన్యువుల కంటే V.బొలివియానా జన్యువు పెద్దదని పరిశోధకులు కనుగొన్నారు. అయితే వాస్తవానికి V. క్రూజియానా, V బొలివియానా యొక్క సాధారణ పూర్వ జాతులు.. దాదాపు ఐదు మిలియన్ సంవత్సరాల కిందటే V. అమెజోనికా నుంచి విస్తరించి ఉన్నట్లు తదుపరి జన్యుశాస్త్ర విశ్లేషణలో తేలింది. అంటే ఇవి సుమారు మిలియన్ సంవత్సరాల క్రితమే కనిపించాయి. V. బొలివియానా ఉనికికి సంబంధించి తక్కువ భౌగోళిక పరిధిని కలిగి ఉన్నందున ఇతర జాతులతో పోలిస్తే అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.