Winter: మార్నింగ్ సమయంలో బెల్లం టీ తాగితే కలిగే బెనిఫిట్స్..?
ప్రతిరోజూ ఉదయం పూట బెల్లం టీ (jaggery Tea)తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రతిరోజూ ఉదయం పూట బెల్లం టీ (jaggery Tea)తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ శీతాకాలం(winter)లో బెల్లం టీ తాగినట్లైతే.. శరీర ఉష్ణోగ్రత నిర్వహణ(Body temperature management)కు తోడ్పడుతుంది. బెల్లంలో మెగ్నీషియం(Magnesium), ఐరన్(iron), పొటాషియం(potassium), ఖనిజాలు(minerals), యాంటీఆక్సిడెంట్లు(antioxidants) పుష్కలంగా ఉంటాయి. కాగా బెల్లం టీ జలుబు(cold), దగ్గు(cough) వంటి ప్రాబ్లమ్స్‌ను దూరం చేస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచడంలో, రక్తహీనత నయమవడం(Cure anemia)లో, జీర్ణక్రియ(digestion)కు సహాయపడడంలో మేలు చేస్తుంది.
వీటితో పాటు బెల్లం టీ తాగడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు(fat) రాకుండా ఉంటుంది. దీంతో బరువు సమస్యను ఫేస్ చేయాల్సిన సిచ్యూవేషన్ రాదు. అలాగే మార్నింగ్ సమయంలో బెల్లం టీ తాగితే.. ఎలక్ట్రోలైట్ సమతుల్యత(Electrolyte balance)ను కాపాడుతుంది. జీవక్రియ(Metabolism)ను పెంచడమే కాకుండా కండరాలను నిర్మించడానికి బెల్లం టీ లో ఉండే పొటాషియం మేలు చేస్తుంది. ఒకవేళ బరువు ఉన్న వెయిట్ లాస్(Weight loss) అయ్యేందుకు ఇది సహాయపడుతుంది. బెల్లం టీ ఉదయం పూటనే కాకుండా సాయంత్రం పూట కూడా తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.