కను బొమ్మలు పలుచబడుతున్నాయా? ఇదిగో పరిష్కారం

దిశ, ఫీచర్స్ : ముఖారవిందానికి అందమైన కనులే అసలైన ఎస్సెట్. అలాంటి కళ్ల సోయగాన్ని రెట్టింపు చేసేవి కనుబొమ్మలే కాబట్టి..

Update: 2022-04-07 07:04 GMT

దిశ, ఫీచర్స్ : ముఖారవిందానికి అందమైన కనులే అసలైన ఎస్సెట్. అలాంటి కళ్ల సోయగాన్ని రెట్టింపు చేసేవి కనుబొమ్మలే కాబట్టి.. అమ్మాయిలు ఐబ్రోస్‌పై స్పెషల్‌గా కాన్సంట్రేట్ చేస్తుంటారు. రకరకాల ఐబ్రోస్ డిజైన్స్ ఫాలో అవుతుంటారు. ఇక ఒకప్పుడు అతి పల్చని కనుబొమ్మలు ఫ్యాషన్‌కు ప్రతీకగా నిలిస్తే.. ఇప్పుడు థిక్ ఐబ్రోస్ హవా నడుస్తోంది. కానీ కొంతమందికి కనుబొమ్మల్లోని వెంట్రుకలు పలుచబడటంతో బాధపడుతుంటారు. ఈ సమస్యకు కాస్మటాలజిస్ట్స్ చూపుతున్న పరిష్కారం ఏంటో చూద్దాం.

ఇన్ఫెక్షన్స్, హార్మోన్లలో తేడాలు, పోషకాహార లేమి, ఒత్తిడి సహా అనేక కారణాల వల్ల కనుబొమ్మలు సన్నబడే అవకాశముంది. తామర, సోరియాసిస్, కాంటాక్ట్ డెర్మటైటిస్, సెబోరోహెయిక్ డెర్మటైటిస్, రింగ్‌వార్మ్ వంటి వ్యాధులను ఇతర కారకాలుగా చెప్పవచ్చు. కొందరికి వంశపారంపర్యంగా, మరికొందరికి వయసు పెరిగేకొద్దీ ఈ సమస్య తలెత్తవచ్చు. అంతేకాదు మేకప్‌ ఎక్కువగా వేసుకున్నా, అదే పనిగా ఐబ్రో పెన్సిల్‌ వాడినా, షేపింగ్‌ చేసినా పలచబడే అవకాశముంది. ఈ ప్రతికూలతను నివారించేందుకు ముందుగా ఒత్తిడిని తగ్గించుకుని, శరీరానికి అవసరమైన పోషకాహారం తీసుకోవాలి. డైట్‌లో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫ్యాట్‌, ఫైబర్‌, అమైనో, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్‌ ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఏది లోపించినా పై సమస్య ఎదురయ్యే ప్రమాదముంది. ఇక కంటినిండా నిద్ర కూడా అవసరమే.

థైరాయిడ్ లోపం 

థైరాయిడ్ ఓవర్ యాక్టివ్, అండర్ యాక్టివ్.. ఈ రెండు సందర్భాల్లోను జుట్టు రాలుతుంది. కానీ కనుబొమల చివర్లు సన్నబడటం గమనించినట్లయితే.. సాధారణంగా ఇది రెండోదానికి సంకేతం.

అలోపేసియా అరేటా 

కనుబొమలు సన్నబడటానికి ప్రధాన కారణం 'అలోపేసియా అరేటా'. దీనివల్ల జుట్టు కూడా రాలుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది స్వయం ప్రతిరక్షక పరిస్థితి. అంటే ఇక్కడ శరీర రోగనిరోధక వ్యవస్థ జుట్టు కుదుళ్లపై పొరపాటున దాడి చేయడంతో జుట్టు ఊడిపోతుంది. ఇది ఐబ్రోస్‌పైనా ఎఫెక్ట్ చూపుతుంది.

వృద్ధాప్యం 

కనుబొమ్మలు సన్నబడటానికి వృద్ధాప్యం కూడా ఓ కారణం. అందుకే 45 ఏళ్లు దాటిన తర్వాత కనుబొమ్మలు చాలా పలుచబడిపోతాయి.

Tags:    

Similar News