Movies : దీపావళి విన్నర్ ఎవరు?

ఈ దీపావళికి నాలుగు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి

Update: 2024-11-03 02:57 GMT
Movies : దీపావళి విన్నర్ ఎవరు?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ఈ దీపావళికి నాలుగు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాలుగు సినిమాల హీరోలు కొత్త కథతో రావడంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా " లక్కీ భాస్కర్ "( Lucky Baskhar) ఫైనాన్షియల్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇంత వరకు రాని కథతో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) 'క' సినిమాతో మన ముందుకొచ్చాడు. అయితే, సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిన ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలెట్ గా నిలిచాయి. ఇప్పటి వరకు కిరణ్ అబ్బవరం తీసిన సినిమాల్లో 'క' మూవీ మంచి పొజిషన్లో నిలిచింది. ఇక శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన "అమరన్ " (Amaran) సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా, సాయి పల్లవి నటన సినిమాకి ప్లస్ అయింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథగా రూపొందింది.

ప్రశాంత్ నీల్ కథతో శ్రీమురళి హీరోగా వచ్చిన కన్నడ సినిమా " బఘీర " (Bagheera). సూపర్ హీరో జోనర్ లో వచ్చిన ఈ మూవీ మిగతా సినిమాలతో పోల్చుకుంటే యావరేజ్ గా నిలిచింది. రొటీన్ కథ, స్క్రీన్ ప్లే కూడా కుదరకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక, మొత్తానికి చూసుకుంటే ఈ దీపావళికి "లక్కీ భాస్కర్" సినిమా విన్నర్ గా నిలిచింది. 

Tags:    

Similar News