ఆ హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్న హీరో.. అది చూసిన భార్య తట్టుకోలేక..

Update: 2022-02-24 07:30 GMT

దిశ, సినిమా: సీనియర్ హీరో వినోద్ కుమార్ ఫ్యామిలీ హీరోగా మెప్పుపొందాడు. 1991లో 'మామగారు' సినిమాకు ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు అందుకున్న ఆయన.. యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత మందిని ప్రేమించిన తిరిగి ఎవరు ప్రేమించకపోవడంతో చివరికి అరేంజ్ మ్యారేజ్ చేసుకోక తప్పలేదన్నాడు.

ఈ క్రమంలో భార్యను షూటింగ్ స్పాట్‌కు తీసుకెళ్లగా.. హీరోయిన్‌‌ ఆమనితో రొమాంటిక్ సీన్ చూసి తట్టుకోలేక, వెంటనే సెట్స్ నుంచి వెళ్లిపోయిందని తెలిపాడు. ఇక దేశంలో అంబానీ తర్వాత మీకే భారీ ఆస్తులు ఉన్నాయంటున్నారు నిజమేనా? అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఆయన దాంట్లో 0.1% కూడా లేదని పెద్ద జోక్ పేల్చాడు. ఇక 'కర్తవ్యం' సినిమా కోసం సాయి కుమార్‌ తనకు డబ్బింగ్‌ చెప్పడానికి ఒప్పుకోకపోవడంతో కొట్టడానికి సిద్ధమయ్యానంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.

Tags:    

Similar News