దిశ, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం లో పశువైద్యం దయనీయంగా మారింది. మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. చిన్నశంకరంపేట మండలం లో పాడి పశువుల పెంపకానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు రైతులు. ఇలాంటి ప్రాధాన్యం ఉన్న మండలం లో పశువైద్యం దయనీయంగా మారింది. మండలంలో పశు వైద్య ఉప కేంద్రాలు మడూర్, కొర్విపల్లి గ్రామాలలో ఉన్నాయి. ఈ ఉప కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండటంతో ఈ గ్రామాలలో పశువుల సంఖ్య బాగుంది. ఈ గ్రామాలలో పశువులకు వైద్యం అందక మండల కేంద్రంలోని పశు వైద్య కేంద్రానికి చికిత్స నిమిత్తం పశువులను ఇబ్బందుల వల్ల తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రెండు ఉప కేంద్రాల్లో అటెండర్, డాక్టర్, సిబ్బంది లేకపోవడంతో రైతులు పశువుల పట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మండల కేంద్రంలో ఉన్న పశువైద్యాధికారి గీతమాలిక 317 జీవో లో బదిలీ కాగా ఈ స్థానంలో వైద్యాధికారి గీత నియామకం అయ్యారు. అటెండర్.. కిందిస్థాయి సిబ్బంది లేకపోవడంతో గోపాలమిత్ర సిబ్బందిని తీసుకుని పశువులకు చికిత్స నిర్వహిస్తున్నారు. కొరివి పల్లి, మడూర్ కేంద్రంలోని డాక్టర్ లేకపోవడంతో ప్రైవేటు వైద్య అధికారులు ఆశ్రయిస్తున్నారు. మండల కేంద్రంలో ఉన్న పశువైద్యశాలలో ఉన్న డాక్టర్ గీత, గోపాలమిత్ర సభ్యుల సహాయంతో ఇక్కడికి వచ్చిన పశువులకు.. చికిత్స చేసి, మందులు పంపిణీ చేస్తున్నారు. అధికారులు స్పందించి పశు వైద్య సిబ్బందిని నియమించాలని మండలంలోని రైతులు కోరుతున్నారు.