వైశ్య సదన్‌కు నాలుగు నెలలే టైం: మంత్రి హరీష్ రావు

దిశ, సిద్దిపేట: వచ్చే నాలుగు నెలల్లో వైశ్య సదన్‌ను వినియోగంలోకి తీసుకురావాలని రాష్ట్ర ఆర్థిక.. Latest Telugu News..

Update: 2022-03-17 09:03 GMT

దిశ, సిద్దిపేట: వచ్చే నాలుగు నెలల్లో వైశ్య సదన్‌ను వినియోగంలోకి తీసుకురావాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మున్సిపల్ అధికారులను ఆదేశించారు.గురువారం సిద్దిపేట పురపాలక సంఘం పరిధిలో G+1 విధానంలో నిర్మాణంలో ఉన్న వైశ్య సదన్‌ను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఇప్పటికే రూ.2.6 కోట్లతో దీని నిర్మాణం చేపట్టగా, ఆ నిధులు సరిపోక పోవడంతో మరో 2 కోట్లు నిధులు మంత్రి మంజూరు చేశారు. సదన్ ప్రధాన పనులు ఇప్పటికే పూర్తి కాగా పెండింగ్ పనులైన ఆర్చ్, గేట్, ప్రవారీ, ఫాల్స్ సీలింగ్ తదితర అన్ని పనులు పూర్తి చేసి.. సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. అంతకుముందు సిద్దిపేట పురపాలక సంఘం పరిధిలోని రేణుక నగర్‌లో G+1 విధానంలో నిర్మాణంలో ఉన్న గౌడ కమ్యూనిటీ బిల్డింగ్‌ను మంత్రి పరిశీలించారు. వచ్చే రెండు నెలల్లో గౌడ కమ్యూనిటీ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు ఆలస్యంగా జరుగుతుండడం పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News