సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల..1,823 మంది క్వాలిఫై

న్యూఢిల్లీ: యూపీఎస్సీ మెయిన్-2021 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ..telugu latest news

Update: 2022-03-17 17:14 GMT
సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల..1,823 మంది క్వాలిఫై
  • whatsapp icon

న్యూఢిల్లీ: యూపీఎస్సీ మెయిన్-2021 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 7 నుంచి 16 వరకు జరిగిన ఈ పరీక్షా ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం విడుదల చేసింది. ఇందులో 1,823 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. వీరికి ఏప్రిల్‌ 5 నుంచి దేశరాజధాని ఢిల్లీలో ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. దేశంలో ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్ తదితర అఖిల భారత సర్వీసులకు ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ యేటా సివిల్స్‌ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో ప్రిలిమినరీ, మెయిన్‌, ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగుల భర్తీ ప్రక్రియను చేపడుతోంది.

Tags:    

Similar News