బయో డీజిల్ కంపెనీ మాకొద్దు..
దిశ, మరికల్: మండలంలోని - Under the auspices of the Chittanur Village Conservation Committee, a protest rally was organized against the jurala agricultural biodiesel industry
దిశ, మరికల్: మండలంలోని చిత్తనూర్ గ్రామ శివారులో నిర్మిస్తున్న జూరాల ఆగ్రో బయో డీజిల్ పరిశ్రమ మాకొద్దని చిత్తనూర్ గ్రామ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం పరిశ్రమ వ్యతిరేక పోరాట సభ నిర్వహించారు. ఈ సభలో మహిళలు, యువకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముక్తకంఠంతో ఈ పరిశ్రమ పనులు నిలిపివేసి, పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కంపెనీ పెట్టాలంటే ప్రజాభిప్రాయం తీసుకోవాలన్నారు.
అనంతరం కంపెనీ గేటు ముందు ధర్నా నిర్వహించి, కంపెనీ యాజమాన్యానికి వినతి పత్రం సమర్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రజాభిప్రాయం మేరకు పనులు నిలిపి వేసి, ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించి గ్రామస్తులకు న్యాయం చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు.