చిరుత పంజాకు రెండు మేకలు బలి..

దిశ, రాజంపేట: చిరుత పులి దాడిలో రెండు - Two goats were killed in a leopard attack

Update: 2022-04-08 10:22 GMT
చిరుత పంజాకు రెండు మేకలు బలి..
  • whatsapp icon

దిశ, రాజంపేట: చిరుత పులి దాడిలో రెండు మేకలు మృతి చెందిన ఘటన శుక్రవారం రాజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వన్జారా కాలనీలో మేకల మందపై చిరుత పులి దాడి చేయడంతో రెండు మేకలు మృతి చెందాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో తర్వాత ఎవరిపై దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటుచేసి చిరుత పులిని పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News