IPL బయో-బబుల్ బ్రేక్.. వాటి కోసమే..
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ జీవన శైలిని మార్చేసింది. ప్రతి ఒక్కరూ ప్రతి విషయంల జాగ్రత్త వహిస్తున్నారు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ జీవన శైలిని మార్చేసింది. ప్రతి ఒక్కరూ ప్రతి విషయంల జాగ్రత్త వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచలో బీసీసీఐ తమ ఆటగాళ్లకూ కఠిన నిబంధనలు పెట్టింది. ఇక ఐపీఎల్‌లో అయితే ప్రతి ఆటగాడిని బయోబబుల్‌లో ఉంచుతూ సంరక్షిస్తోంది. అంతేకాకుండా బయోబబుల్‌లో ఉంచడం ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇందులో భాగంగా స్టేడియంలో విధులు నిర్వర్తించే పోలీసులను కూడా అధికారులు బయోబల్ నుంచి బయటకు రావద్దంటూ సూచనలు చేశారు. కానీ గుజరాత్ టైటాన్స్, హైదరాబాద్ సన్‌రైజర్స్ మ్యాజ్ జరుగుతున్న సమయంలో ఇద్దరు కానిస్టేబుల్స్ బయో-బబుల్ నిబంధనలను ఉల్లంఘించారు. అక్కడ ఉన్న మహిళా కానిస్టేబుళ్లతో గొడవ పడి మరీ బయోబబుల్‌ను బ్రేక్ చేశారు. ఆటగాళ్లతో ఫొటోలు దిగేందుకే వారు ఇలా చేశారు. ఈ విషయం తెలియడంతో వారిద్దిరపై మహారాష్ట్ర నిషేధిత చట్టం సెక్షన్ 85(1) ప్రకారం అధికారులు కేసు నమోదు చేశారు.