జగన్ నిర్ణయం.. రైతుల మెడకు ఉరితాడు!

Update: 2022-02-20 15:14 GMT
జగన్ నిర్ణయం.. రైతుల మెడకు ఉరితాడు!
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలోగా అన్ని జిల్లాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలనే నిర్ణయాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి తప్పుబట్టారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జగన్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా కాంగ్రెస్ పార్టీ పథకమని గుర్తుచేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడమంటే రైతుల మెడలకు ఉరితాడు బిగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని తొలగించేందుకు చేసే పన్నాగమన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం- ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని హితవు పలికారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News