Agniveers: డిసెంబర్లో అగ్నివీర్ తొలిబ్యాచ్ ట్రైనింగ్

Training Of first batch of agniveers will begin in December, says Army Chief General Manoj Pande| దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-06-17 10:44 GMT

న్యూఢిల్లీ: Training Of first batch of agniveers will begin in December, says Army Chief General Manoj Pande| దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్ల ట్రైనింగ్ ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన జాతీయ మీడియాతో మనోజ్ పాండే మాట్లాడారు. 'నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభం అవుతుంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తాం. ఆ తర్వాత మా ఆర్మీ రిక్రూట్‌మెంట్ సంస్థలు రిజిస్ట్రేషన్ ర్యాలీకి సంబంధించిన వివరణాత్మక షెడ్యూల్‌ను ప్రకటిస్తాయి' అని అన్నారు. పథకం గురించి తెలుసుకున్న తర్వాత, ఈ పథకం యువతకే కాదు, అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందనే నమ్మకం వారిలో కలుగుతుందని అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా, గత రెండేళ్లుగా పూర్తి చేయలేని రిక్రూట్‌మెంట్ ర్యాలీల్లో చేరేందుకు సిద్ధమవుతున్న మన యువతకు ఈ నిర్ణయం అవకాశం కల్పిస్తుంది.

ఈనెల 24 నుంచి ఎయిర్ ఫోర్స్‌లో నియామకాలు: ఎయిర్ చీఫ్ వీఆర్ చౌదరీ

కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ నియామకాల్లో వయోపరిమితి పెంచడాన్ని భారత వాయుసేన స్వాగతించింది. ఇది యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ అన్నారు. ఈ మేరకు శుక్రవారం వర్చువల్‌గా ప్రసంగించారు. 'కేంద్రం వయోపరిమితి పెంచడాన్ని స్వాగతిస్తున్నాం. ఇది యువతకు మేలు చేకూరుస్తుంది. భారత వాయు దళ నియామక ప్రక్రియ ఈ నెల 24నుంచి ప్రారంభమవుతుంది' అని చెప్పారు. 

Tags:    

Similar News