Pooja Hegde: ఈ రోజు బుట్ట బొమ్మ పూజా హెగ్డే బర్త్డే..

నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు

Update: 2024-10-13 04:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర స్థానంలో నిలిచిన హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పుడు మాత్రం సినిమాలలో కూడా కనిపించడం లేదు. మోడలింగ్‌తో తన కెరీర్‌ను మొదలు పెట్టిన బుట్ట బొమ్మ టాప్ హీరోలందరితో నటించింది. ఒక లైలా కోసం మూవీతో పూజా హెగ్డే టాలీవుడ్‌కు పరిచయం అయింది.

అల్లు అర్జున్‌తో అలా వైకుంఠపురం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ మొత్తం ఒక ఎత్తైతే బుట్ట బొమ్మ పాట మాత్రం మరో వైపు అని చెప్పుకోవాలి. ఆ సినిమా తర్వాత నుంచి పూజా హెగ్డే ను బుట్ట బొమ్మ అని పిలవడం మొదలు పెట్టారు. అదే క్రేజ్ తో వరుస ప్రాజెక్ట్ ల మీద సైన్ చేసింది. అవన్నీ ఫ్లాపులవ్వడంతో బుట్టబొమ్మ కెరీర్ అక్కడి నుంచి డౌన్ అయింది. హిందీ, తమిళంలో సినిమాలు చేస్తుంది కానీ, ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా చేతిలో లేదు. మరి ముందు ముందు ఆఫర్స్ వస్తాయో? రావో చూడాలి. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నటీ నటులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు.

Full View

Tags:    

Similar News