'రైతు సమస్యలపై చర్చించాకే తీర్మానం ప్రవేశ పెట్టండి'

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా జడ్పీ సాదరంగా సమావేశం జడ్పీ..latest telugu news

Update: 2022-03-30 07:29 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా జడ్పీ సాదరంగా సమావేశం జడ్పీ చైర్మన్ దఫెదర్ శోభ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. సమావేశంలో ముందుగా కేంద్ర ప్రభుత్వమే వరి కొనుగోలు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని సభ్యులను కోరగా కాంగ్రెస్ పార్టీ జడ్పీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి విభేదించారు.

తీర్మానానికి తాము కూడా మద్దతు ఇస్తామని, దానికంటే ముందుగా రైతు సమస్యలపై చర్చించాలని, చర్చ అనంతరమే తీర్మానం ప్రవేశపెట్టాలని కోరగా.. అందుకు చైర్మన్ నిరాకరించారు. ముందు తీర్మానం ఆమోదం తర్వాతే చర్చ చేద్దామని చెప్పగా జడ్పీటీసీ, చైర్మన్‌కు మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో వరితో ఉరే.. యాసంగిలో ధాన్యం కొనం అనే శీర్షికన పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్‌తో జడ్పీటీసీ మోహన్ రెడ్డి నిరసన తెలిపారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఆయన మైక్ కట్ చేశారు. అనంతరం చైర్మన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి తీర్మానం కాపీని చైర్మన్‌కు అందజేశారు.

Tags:    

Similar News