Kanguva Trailer : 'కంగువా' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. ఎదురు ఇస్తాం అంటూ డబుల్ రోల్‌లో సూర్య ఇరగదీశాడుగా
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya), డైరెక్టర్ శివ(Shiva) కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కంగువా. స్టూడియో గ్రీన్(Studio Green), యూవీ క్రియేషన్స్(UV Creations) నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్(Bobby Deol) విలన్ రోల్‌లో, దిశా పటాని(Disha Patani) హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్(Songs), టీజర్(Teaser), ట్రైలర్స్(Trailer) అన్ని సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మూవీపై మరింత హైప్ పెంచేసింది.
ఇక ట్రైలర్ చూస్తుంటే రెండు కాలాలకు లింక్ చేసి ఉండే కథలా ఉంది. ఫుల్ యాక్షన్ సీన్స్‌తో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఉన్నట్టు అర్ధమవుతుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్స్‌లో కేవలం పీరియాడిక్ సూర్య సీన్స్ చూపించారు. మొదటిసారి పీరియాడిక్‌తో పాటు ప్రస్తుత సూర్య సీన్స్ లింక్ చేస్తూ చూపించడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.