పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

దిశ,చౌటుప్పల్: కేసీఆర్‌ను గద్దె దించడం కోసం తప్ప.. స్వార్థ ప్రయోజనాల కోసం ఎట్టి పరిస్థితుల్లో latest telugu news..

Update: 2022-03-16 11:35 GMT

దిశ, చౌటుప్పల్: కేసీఆర్‌ను గద్దె దించడం కోసం తప్ప.. స్వార్థ ప్రయోజనాల కోసం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను సూటిగా ఖండించకుండా ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే కేసీఆర్‌ను గద్దె దించడం కోసమే మారతాము అని అన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో ఒకరిని ఒకరు లాగే ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించాలంటే అందరూ కలిసికట్టుగా ఉండాలని తెలిపారు.



ప్రజా సమస్యలపై నిరంతరం దేవుడిచ్చిన శక్తిమేరకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం నారాయణపురం మండల కేంద్రంలో పర్యటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక ఆయుర్వేద ఆస్పత్రిని పరిశీలించారు. అసెంబ్లీలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై గొంతెత్తి తమను తిరిగి విధుల్లోకి తీసుకోవడంలో ప్రముఖ పాత్ర వహించినందుకు ఎమ్మెల్యేకు ఫీల్డ్ అసిస్టెంట్లు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, బక్క శ్రీనాథ్, కరంటోతూ శ్రీను నాయక్, కరంటోతూ బిక్షపతి నాయక్, ఉప్పల లింగస్వామి, మందుగుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News