ప్రతి భారతీయుడు చూడవలసిన సినిమా 'ది కాశ్మీర్ ఫైల్స్': జితేందర్ రెడ్డి
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఇరవై ఏళ్ల క్రితం కాశ్మీర్ లో జరిగిన అరాచకాలకు సంబంధించిన అంశాలే latest telugu news..
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఇరవై ఏళ్ల క్రితం కాశ్మీర్ లో జరిగిన అరాచకాలకు సంబంధించిన అంశాలే 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రమని భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏవిడి సినిమాస్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక షోను భారతీయ జనతా పార్టీ శ్రేణులు, ప్రేక్షకులు తిలకించారు. ఇది సినిమా అని కాకుండా ఆనాడు హిందూ ప్రజానీకంపై జరిగిన అరాచకాలు ఏ స్థాయిలో ఉందో దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపారని జితేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చిన్న చిత్రంగా విడుదలై అత్యంత ఆదరణ పొందుతున్న ఈ చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు నేతలు అభినందించారని కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఈ చిత్రానికి సంబంధించి ఉత్తర ప్రదేశ్. కర్ణాటక, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు టాక్సీని మినహాయించాయని, అస్సాం ప్రభుత్వం ఈ సినిమా కోసం ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం జరిగిందన్నారు. అల్లరి మూకల అరాచకాల కారణంగా చింద్రమైన హిందూ కుటుంబాల జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపడంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సక్సెస్ అయ్యారని చెప్పారు. ఈ సినిమాను తిలకించి మీడియా సమావేశంలో మాట్లాడిన వారిలో బిజెపి నేతలు నాగూరావు నామాజీ, అశ్వత్థామరెడ్డి, పద్మజా రెడ్డి, పాండురంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మ చారి, రాష్ట్ర యువ నేత మిథున్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.