NTR: తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌తో జతకట్టబోతున్న టాలీవుడ్ ప్రముఖ హీరో

అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోల జాబితాలో గుర్తింపు దక్కించుకున్నాడు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్.

Update: 2024-11-10 05:11 GMT
NTR: తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌తో జతకట్టబోతున్న టాలీవుడ్ ప్రముఖ హీరో
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోల జాబితాలో గుర్తింపు దక్కించుకున్నాడు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR). సింహాద్రి(Sinhādri), రాఖీ, నరసింహుడు(Narasimha), శక్తి, ఊసరవెల్లి(Ūsaravelli), యమదొంగ, అల్లరి రాముడు(Allari rāmuḍu), సుబ్బు, స్టూడెంట్ నెంబర్ వన్, నిన్ను చూడాలని, నాన్నకు ప్రేమలో, జనతా గ్యారేజ్(Janata Garage), ఆర్ఆర్ఆర్(RRR), దేవర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు తారక్. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు. అయితే ఈ హీరో గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.

బ్లాక్ చిత్రాన్ని జైలర్ ను తెరకెక్కించిన తమిళ దర్శకుడు నెల్సన్(Nelson) తో జతకట్టబోతున్నాడట ఎన్టీఆర్. మరీ ఈవార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. తారక్ అండ్ నెల్సర్ కలయిక వెలుగులో వచ్చింది. జైలర్ వంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నెల్సన్ తో సినిమా అంటే మామూలుగా ఉండదు మరీ.. ఎన్టీఆర్ మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వీరిద్దరి మధ్య సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా జరుగుతున్నట్లు సోషల్ మీడియా టాక్. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ థియేటర్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. పార్ట్ -2 కు రెడీ అవుతున్నారు. అలాగే తారక్.. ప్రశాంత్ నీల్(Praśānt neel) దర్శకత్వంలో వార్ -2 లో నటిస్తున్నారు.


Read More ...

Koratala Siva: ఆ స్టార్ హీరో కొడుకుతో కొరటాల శివ నెక్స్ట్ సినిమా?


Tags:    

Similar News