రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో 'హెచ్ఐవీ.. పోలీసులకు కంప్లైంట్
దిశ, తెలంగాణ బ్యూరో: రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో నిత్యం రక్తం ఎక్కించుకుంటున్న ఓ తలసేమియా పేషెంట్‌కు హెచ్ఐవీ సోకింది. గ
దిశ, తెలంగాణ బ్యూరో: రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో నిత్యం రక్తం ఎక్కించుకుంటున్న ఓ తలసేమియా పేషెంట్‌కు హెచ్ఐవీ సోకింది. గతంలో లేని వైరస్ తేలడంతో పేషెంట్ కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. దీంతో నల్లకుంట పోలీస్‌స్టేషన్‌లో జూలై 30 న లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ లెటర్ ఆలస్యంగా వెలుగులోకి రావడమే కాక సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తిరుగుతున్నది. ఆ ఫిర్యాదు లేఖలో పేర్కొన్న ప్రకారం ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ''రంగారెడ్డి జిల్లా రాంపల్లి గ్రామానికి చెందిన బి. శివ(27) అనే వ్యక్తికి 2017లో మ్యారేజ్ అయింది. ఆ తర్వాత ఓ బాబు జన్మించాడు(ప్రస్తుతం 3 ఏళ్లు). అయితే ఆయన పుట్టుకతోనే తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. డాక్టర్ల సూచనతో రక్తం ఎక్కించేందుకు సిద్ధమయ్యాం. విద్యానగర్ నల్లకుంట పరిధిలోని రెడ్ క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌ను ఎంపిక చేసుకొని లాస్ట్ రెండున్నర సంవత్సరాలుగా రక్తం ఎక్కిస్తూనే ఉన్నాం. ప్రతీ పది హేను రోజులకు ఒకసారి బ్లడ్ ను ఎక్కిస్తున్నాం. గత నెలలో కూడా 20 జూలై 2022న బ్లడ్ ట్రాన్స్‌ప్యూజన్ చేశాం. ఆ తర్వాత డాక్టర్ సలహతో బ్లడ్ టెస్టులు చేస్తే హెచ్ ఐవీ నిర్ధారణ అయింది. దీంతో నేను నా భార్య రెండు ఆసుపత్రుల్లో చెక్ చేపిస్తే హెచ్ ఐవీ నెగెటివ్ తేలింది. కానీ మా బాబుకు ఆ రెండు ఆసుపత్రుల్లో చేసిన టెస్టు పాజిటివ్ వచ్చింది. పూర్తి స్థాయి ఎంక్వైరీ తీసుకొని చర్యలు తీసుకోవాలని విన్నపించుకుంటున్నాను"అని ఆ బాలుడు తండ్రి శివ పోలీసులకు ఫిర్యాదు చేశారు.