ఆబ్కారీకి దండిగా ఆదాయం.. ఈ ఆర్థికంలో రూ.30వేల కోట్లు

తెలంగాణ ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా సమకూరే ఆదాయం రోజు రోజుకూ పెరుగుతోంది.

Update: 2022-03-18 15:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా సమకూరే ఆదాయం రోజు రోజుకూ పెరుగుతోంది. స్వరాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలో 2014–15లో మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 10.88 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం ఎనిమిదేళ్లలో మూడింతలు పెరిగి రూ.30వేల కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 11 నెలల్లో రూ.27,962 కోట్లు ప్రభుత్వానికి రాబడి రాగా.. ఈ నెలలో దాదాపు రూ. 2.5వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 26,074.83 కోట్లు రాబడి రాగా.. ఈసారి దాదాపు రూ.5వేల కోట్లు పెరగనుంది. ఇదే తరహాలో వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా మరో 5 వేల కోట్లు పెంచి రూ.35వేల కోట్లకుపైగా ఆదాయాన్ని తీసుకురావాటమే టార్గెట్‌గా పెట్టుకుంటున్నారు.

Tags:    

Similar News