"మా ఆయనకు ఆ హీరోయిన్‌కు మధ్య ఉన్న కెమిస్ట్రీ బాగుంటుంది".. మెగా కోడలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

స్టార్ కపుల్ రామ్ చరణ్(Ram Charan)- ఉపాసన(Upasana)ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-11-03 02:38 GMT
"మా ఆయనకు ఆ హీరోయిన్‌కు మధ్య ఉన్న కెమిస్ట్రీ బాగుంటుంది"..  మెగా కోడలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: స్టార్ కపుల్ రామ్ చరణ్(Ram Charan)- ఉపాసన(Upasana)ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఒకరినొకరు లవ్ చేసుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అలా మ్యారేజ్ చేసుకున్న వీరు.. సినిమాల్లో స్టార్ హీరోగా రామ్ చరణ్, అపోలో హాస్పిటల్(Apollo Hospital) అధిపతిగా ఉపాసన మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే పెళ్లి అయిన 11 ఏళ్లకు ఈ జంటకు క్లీంకార(Klinkara) అనే పాప జన్మించింది. అయితే ఈ ప్రిన్సెస్ ఫేస్‌ని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. దీంతో పాపను ఎప్పుడెప్పుడు చూపిస్తారా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Director Shanker) భారీ బడ్జేట్‌తో తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. కియారా అద్వాని(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్స్ నటించారు. స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే వీరందరిలో ఉపాసనకు మోస్ట్ ఫేవరేట్ హీరోయిన్ మాత్రం తమన్నా(Tamanna) అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “రామ్ చరణ్ - తమన్నా కెమిస్ట్రీ బాగుంటుంది. వాళ్ళ స్క్రీన్ టైం ఇంకా బాగా నచ్చుతుంది. మా ఆయన పక్కన తమన్నానే బాగుంటుంది” అని ఉపాసన చెప్పుకొచ్చింది. ఇక అప్పట్లో ఉపాసన మాటలకు మెగా ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఉపాసన ఇంత మెచ్యూరిటీ మైండ్ కల మేడమా..? నిజంగా గ్రేట్. రామ్ చరణ్ ఈజ్ సో లక్కీ అంటూ ఓ రేంజ‌లో పొగిడేస్తున్నారు. కాగా రామ్ చరణ్ - తమన్నా కలిసి రచ్చ(Racha) మూవీలో నటించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News