కర్రతో పోరు స్టార్ట్ చేసిన నటి.. ‘దేవకీ నందన వాసుదేవ’మూవీ నుంచి పవర్‌ ఫుల్ లుక్

అశోక్ గల్లా(Ashok Galla) ‘హీరో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రజెంట్ ఆయన హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’(Devaki Nandana Vasudeva).

Update: 2024-11-04 12:10 GMT
కర్రతో పోరు స్టార్ట్ చేసిన నటి.. ‘దేవకీ నందన వాసుదేవ’మూవీ నుంచి పవర్‌ ఫుల్ లుక్
  • whatsapp icon

దిశ, సినిమా: అశోక్ గల్లా(Ashok Galla) ‘హీరో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రజెంట్ ఆయన హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’(Devaki Nandana Vasudeva). ఈ సినిమాకు అర్జున్ జంధ్యాల(Arjun Jandhyala) దర్శకత్వం వహిస్తుండగా.. నల్లప నేని యామిని సమర్పణలో లలితాంబికా(Lalithambika) ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదలైంది. ‘దేవకీ నందన వాసుదేవ’ మూవీలో దేవకీ పాత్రలో నటి ఝాన్సీ(Jhansi) నటిస్తోంది.

చిత్రబృందం కౌంట్‌డౌన్‌ పోస్టర్‌తో పాటు ఆమె పవర్ ఫుల్ లుక్‌(powerful look)ను షేర్ చేశారు. ఇందులో ఝాన్సీ చేతిలో కర్ర పట్టుకుని పోరుకు బయలు దేరినట్లుగా కనిపిస్తోంది. కొడుకు కోసం ఫైట్ చేసే తల్లి క్యారెక్టర్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ‘దేవకీ నందన వాసుదేవ’ ఇంకా పది రోజుల్లో నవంబర్ 14న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Tags:    

Similar News