ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారికి గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనౌన్స్ చేసినటువంటి గవర్నమెంట్..telugu latest news
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనౌన్స్ చేసినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలకు అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. టెలివిజన్ ద్వారా గ్రూప్-1, టెట్, టీచర్ పోస్టులు, పోలీసు, వైద్యారోగ్యశాఖలోని పలు పోస్టులకు పోటీ పడుతున్న వారికి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 4 నుంచి ప్రారంభంకానున్నది
-టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు ఏప్రిల్ 4 నుంచి జూన్ 4 వరకు మొత్తం 60 రోజుల పాటు 102 ఎపిసోడ్ల ద్వారా శిక్షణ అందించనున్నారు.
-ఉదయం, మధ్యాహ్నం ఒక్కో సబ్జెక్టుకు 30 నిమిషాల పాటు ప్రసారం చేయనున్నారు.
ఇంతకు ముందే అన్ని రకాల పోటీ పరీక్షల కోసం టీశాట్ 1500 గంటల సమయం ఉన్న వీడియోరికార్డులను సిద్ధం చేసింది.
అభ్యర్థులు కావాలనుకుంటే డిజిటల్ ప్రశ్నపత్రాన్ని వారి మెయిల్ ఐడీకి పంపిస్తారు.
టీశాట్ అన్ని సబ్జెక్ట్‌లకు కలిపి 50వేల ప్రశ్నలను సిద్ధంగా ఉంచింది.