నాగలక్ష్మి ఆత్మహత్యకు కారణమైన అందరినీ శిక్షించాలి: చంద్రబాబు
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఏ వర్గానికీ రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందారు.
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఏ వర్గానికీ రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మచిలీపట్నంలో విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ నాగలక్ష్మి ఆత్మహత్యతో మరోసారి రుజువైందని అన్నారు. అధికార పార్టీ నేతల వేధింపులు తాళలేకే వీవోఏ నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నదని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించకపోవడం దారుణమని అన్నారు. స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కంటే, బాధితుల వేదనల కంటే, రాజకీయ ప్రయోజనాలే పోలీసులకు ముఖ్యంగా మారిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగలక్ష్మి ఆత్మహత్యకు కారణమైన వారందరినీ శిక్షించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.