'బాహుబలి'కి ఏడేళ్లు.. తమన్నా స్పెషల్ మెసేజ్

దిశ, సినిమా : మిల్కీబ్యూటీ తమన్నా భాటియా యంగ్ హీరోయిన్లతో పోటీపడుతూ దూసుకుపోతుంది..Latest Telugu News

Update: 2022-07-10 07:29 GMT

దిశ, సినిమా : మిల్కీబ్యూటీ తమన్నా భాటియా యంగ్ హీరోయిన్లతో పోటీపడుతూ దూసుకుపోతుంది. సోషల్ మీడియాలోనూ సత్తా చాటుతున్న నటి.. 'బాహుబలి' విడుదలై ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులతో నిర్వహించిన 'ఆస్క్ తమన్నా'లో ఆసక్తికర విషయాలు పంచుకుంది. జీవితంలోని ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలన్న బ్యూటీ.. నేర్చుకున్న పాఠాలను ఇతరులతో షేర్‌ చేసుకోవాలని సూచించింది.

ఇక తనకు జ్ఞాపకశక్తి చాలా తక్కువని చెప్పిన నటి.. దీని కారణంగా చాలాసార్లు భయాందోళనకు గురయ్యానని, ఇప్పటికీ ఆ సమస్య తనను వెంటాడుతున్నట్లు తెలిపింది. అలాగే తన కెరీర్‌లో 'ధర్మదురై' చిత్రంలో సుభాషిణి, 'బాహుబలి'లో అవంతిక, 'ఎఫ్‌ 3'లో చేసిన అబ్బాయి పాత్ర ప్రత్యేకమన్న తమన్నా.. ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ డ్యాన్స్‌ ఫిల్మ్‌‌తో పాటు హాలీవుడ్‌లో నటించాలని ఉందని వెల్లడించింది. చివరగా 'ప్యాషన్‌ను ఫాలో అవ్వండి. మీ గోల్‌ను సాధించేందుకు శ్రమించండి. ఈ ప్రయత్నంలో విఫలమైనా మళ్లీ ప్రయత్నించండి' అంటూ ఆదర్శవంతమైన మాటలతో ముగించింది మిల్కీబ్యూటీ.


Similar News