రెడ్ హ్యండెడ్‌గా దొరికిన తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగస్తులు.. నెట్‌లో అవి చూస్తూ..
దిశ, రాయికల్: ప్రజలు పలు సమస్యల పరిష్కారం కోసం, దరఖాస్తులు సమర్పించేందుకు మండల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
దిశ, రాయికల్: ప్రజలు పలు సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు సమర్పించేందుకు మండల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. తమ సమస్యలు ఎప్పుడెప్పుడు పరిష్కారమవుతాయా అని ఎదురుచూస్తుంటారు. కానీ వాటిని నమోదు చేయాల్సిన తహసీల్దార్ కార్యాలయంలోని ఉద్యోగులు మాత్రం విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ రాజేందర్ ఏమీ పట్టించుకోకుండా విధులు నిర్వర్తించాల్సిన సమయంలో అతడు కంప్యూటర్‌లో వాట్సాప్‌లో చిట్ చాట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అదే విధంగా మండల ప్రణాళిక, గణాంక అధికారి మహేష్ కూడా నెట్‌లో కార్యాలయ పనులను పక్కన పెట్టి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పెట్టుడులను చూస్తున్నారు. ఎంతో మంది ప్రజల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే వాటి పరిష్కారానికి ప్రయత్నించకుండా కాలక్షేపం చేస్తున్న ఉద్యోగస్తులపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమ విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.