Suzuki V-Strom: రూ. 2.11 లక్షల ధరలో స్పోర్ట్స్ అడ్వెంచర్ 'వీ-స్ట్రోమ్' బైక్!
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్..telugu latest news
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన సరికొత్త 250సీసీ స్పోర్ట్స్ అడ్వెంచర్ బైక్ 'వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్'ను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైకు ద్వారా సుజుకి కంపెనీ స్పోర్ట్స్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలోకి అడుగుపెట్టిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ధరను రూ. 2.11 లక్షలుగా నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ బైకు ద్వారా వినియోగదారులు రోజువారీ ప్రయణాలతో పాటు క్లిష్టమైన రోడ్లలోనూ, దూర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ మోటార్‌సైకిల్ 249సీసీ ఇంజిన్‌తో వస్తుందని, అన్ని రకాల ప్రాంతాలకు అనుగుణంగా ప్రయాణించేందుకు వీలుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ఎక్కువగా స్పోర్ట్స్ అడ్వెంచర్ రైడింగ్‌ను ఇష్టపడే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఈ మోడల్‌ను తీసుకొచ్చాము. నగర ప్రాంతాలతో పాటు వివిధ రోడ్లపై మెరుగైన రైడింగ్ అనుభూతిని ఇది అందిస్తుందని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా చెప్పారు. ఈ మోటార్‌సైకిల్‌కు ఉన్న ఆల్-రౌడ్ సామర్థ్యంతో పాటు భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా డిజైన్ చేయబడిందని ఆయన వివరించారు. వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ బైక్ దేశంలోని అన్ని సుజుకి ప్రీమియం డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉందని కంపెనీ వెల్లడించింది.