టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో డీజీఎంకు సమ్మె నోటీస్

దిశ, తాండూర్: ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త..strike notice to DGM under TNTUC

Update: 2022-03-16 09:06 GMT

దిశ, తాండూర్: ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసును బుధవారం బెల్లంపల్లి ఏరియా డీజీఎం(పర్సనల్) రాజేంద్ర ప్రసాద్ కు సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ (టీఎన్టీయూసీ) నాయకులు అందజేశారు. ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మణిరాం సింగ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం 30 వేల మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి, కాంట్రాక్ట్ కార్మికులకు ఫస్ట్ కేటగిరి వేతనం సహా తదితర డిమాండ్లతో కూడిన ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు కనకయ్య, రాములు, మల్లయ్య, వెంకటేశం, గంగాధర్, హాసన్, యాదగిరి, గంగయ్య, శ్రీనివాస్ విజయ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News