Sri Lanka వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్‌ ధరలపై భారీ తగ్గింపు!

Sri Lanka Government Slashes Petrol, Diesel Prices by Rs.20| భారత పొరుగు దేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పాలకులు తీసుకున్న నిర్లక్ష్య నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైంది. దీంతో శ్రీలంకలో నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్,

Update: 2022-07-18 12:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: Sri Lanka Government Slashes Petrol, Diesel Prices by Rs.20| భారత పొరుగు దేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పాలకులు తీసుకున్న నిర్లక్ష్య నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైంది. దీంతో శ్రీలంకలో నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానంటుతున్నాయి. ప్రజలు జీవనం కష్టంగా మారిపోయింది. దీంతో ఆగ్రహనికి గురైన దేశ పౌరులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ప్రజల ఆగ్రహనికి గురైన రాజకీయ నేతలు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడంతో దేశ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయి, తన పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. దీంతో శ్రీలంకలో ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో భారీగా పెరిగిన నిత్యవసర సరుకుల ధరలను, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శ్రీలంక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 20మేర తగ్గించింది. ప్రస్తుతం శ్రీలంకలో ఆ దేశ కరెన్సీ ప్రకారం.. లీటర్ పెట్రోల్ ధర 450 రూపాయలు కాగా, రూ. 20తగ్గించింది. అలాగే లీటర్ 440 ఉన్న డీజిల్‌పై కూడా 20 రూపాయల మేర ధరలు తగ్గించినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది. అయితే, తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రజలకు ఇది కాస్త ఊరట కలిగించే విషయమనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: వేగంగా పెర‌గ‌డంతో ఫారాల్లో కోళ్లు ఇలా మారుతున్నాయి.. స్ట‌డీలో వెల్ల‌డి

Tags:    

Similar News