Pushpa-2: శ్రీలీల దెబ్బకి కనుమరుగైపోయిన సమంత.. ట్రెండింగ్‌లో యంగ్ బ్యూటీ

అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబోలో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘పుష్ప-2’.

Update: 2024-11-18 14:38 GMT
Pushpa-2: శ్రీలీల దెబ్బకి కనుమరుగైపోయిన సమంత.. ట్రెండింగ్‌లో యంగ్ బ్యూటీ
  • whatsapp icon

దిశ, సినిమా: అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబోలో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘పుష్ప-2’ (Pushpa-2). ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రజెంట్ ఈ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. అలాగే.. ఈ ట్రైలర్‌లో కొన్ని సీన్స్ ఫ్యాన్స్‌కు పిచ్చేక్కిస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. అందులో శ్రీలీల (Sreeleela) డ్యాన్స్ సీన్ ఒకటి. 2 నిమిషాల 48 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్‌లో కేవలం శ్రీలీలకు సంబంధించిన చిన్న మూమెంట్ మాత్రమే రివీల్ చేశారు. కానీ ఆ ఒక్క మూమెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

దీంతో ఆ చిన్న సీన్‌ను షేర్ చేస్తూ.. ‘ఈ ఒక్క సీన్ చాలు సినిమా హిట్ అని చెప్పడానికి’, ‘అందుకే నిన్ను డ్యాన్సింగ్ క్వీన్ (Dancing Queen) అనేది.. ఒక్క సెకను సీన్‌లో అన్ని మెలికలా’ అని కామెంట్స్ పెడుతూ నెట్టింట సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాకుండా.. ‘అసలు సమంత ఎవరూ’ అని శ్రీలీలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ‘పుష్ప: ది రైజ్’ ఐటెమ్ సాంగ్‌లో ‘ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సమంత ఊపేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే స్పీడ్‌లో శ్రీలీల కూడా ఊపేందుకు రెడీగా ఉన్నట్లు అర్థం అయిపోతుంది. కాగా.. ‘పుష్ప-2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ (December) 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More...

‘నీతో నాకు ఎప్పుడూ మెమోరబుల్ టైమే’.. ఆమెతో ఉన్న ఫొటో షేర్ చేసిన ఐకాన్ స్టార్.. దానికి అదిరిపోయే రిప్లై ఇచ్చిన బ్యూటీ

Tags:    

Similar News