తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణం 'MMTS'

దిశ, తెలంగాణ బ్యూరో: జూన్‌ 2021 నుంచి ఎంఎంటీఎస్‌ సర్వీసులను దశలవారీగా పునరుద్ధరించి, ప్రస్తుతం 86 ఎంఎంటీఎస్‌ సర్వీసులను నడిపిస్తూ జంటనగరాల ప్రాంతాల్లో ప్రయాణ అవసరాలను తీరుస్తున్నదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌ కుమార్‌ జైన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2022-04-14 14:15 GMT
తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణం MMTS
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: జూన్‌ 2021 నుంచి ఎంఎంటీఎస్‌ సర్వీసులను దశలవారీగా పునరుద్ధరించి, ప్రస్తుతం 86 ఎంఎంటీఎస్‌ సర్వీసులను నడిపిస్తూ జంటనగరాల ప్రాంతాల్లో ప్రయాణ అవసరాలను తీరుస్తున్నదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌ కుమార్‌ జైన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలను వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న పశ్చిమ ప్రాంతంతో అనుసంధానిస్తూ ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, బేగంపేట్‌, లింగంపల్లి, తెల్లాపూర్‌, రామచంద్రాపురం ప్రాంతాల మీదుగా 29 రైల్వే స్టేషన్లను కవర్‌ చేస్తూ 50 కిమీల మేర సర్వీసులను నడుపుతోందన్నారు. ప్రయాణికుల రద్దీ, గమ్యస్థానాలను బట్టి సరైన ప్రాధాన్యతనిస్తూ వివిధ రంగాల ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్‌ సర్వీసుల షెడ్యూలు చేయబడిందన్నారు.

ఉద్యోగరీత్యా వెళ్లే వారికి, కుటుంబ అవసరాల మేరకు దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు ఉపయోగపడేలా ఎంఎంటీఎస్‌ రైళ్లు ఎంతో సౌకర్యవంతంగా అనుకూలంగా ఉంటాయన్నారు. ఎంఎంటీఎస్‌ సర్వీసులు తెల్లవారుజామున 04:30 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి 12:30 గంటల వరకు నడపబడుతున్నాయని అంతేకాక, కనీస చార్జీ రూ 5 గరిష్టంగా రూ 15 చార్జీతో జంటనగరాల్లోని వివిధ ప్రజా రవాణా చార్జీల కంటే ఎంఎంటీఎస్‌ సమర్థవంతంగా తక్కువ చార్జీలతో నడపబడుతుందన్నారు. ఇతర రవాణా వ్యవస్థతో పోలిస్తే రోజువారీ ప్రయాణికులకు తక్కువ ధరతో ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సీజనల్‌ టికెట్‌ సౌలభ్యం కూడా అందుబాటులో ఉందన్నారు. బుకింగ్‌ కౌంటర్లలోనే కాకుండా ఎంఎంటీఎస్‌ టికెట్లను ఆటోమెటిక్‌ టికెట్‌ వెండిరగ్‌ మెషిన్లు (ఏటీవీఎంలు), అన్‌రిజర్వ్‌డ్‌ టికెటింగ్‌ సిస్టం (యూటీఎస్‌) మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా పొందవచ్చన్నారు. ఆటంకాలు లేని ప్రయాణం కోసం నగదు రహిత టికెటింగ్‌ నిర్వహణను, సీజన్‌ టికెట్లు వంటి వివిధ వసతులను ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు.

Tags:    

Similar News