Snapchat: స్నాప్‌చాట్‌లో యూట్యూబ్ వీడియో షేరింగ్ ఆప్షన్!

దిశ, ఫీచర్స్ : ఇటీవలి కాలంలో యువతకు బాగా కనెక్ట్ అయిన యాప్ 'స్నాప్‌చాట్'. అందుకు త‌గ్గట్టుగానే

Update: 2022-04-05 06:44 GMT

దిశ, ఫీచర్స్ : Snapchat| ఇటీవలి కాలంలో యువతకు బాగా కనెక్ట్ అయిన యాప్ 'స్నాప్‌చాట్'. అందుకు త‌గ్గట్టుగానే ఎప్పటికప్పుడు న్యూ ఫీచర్స్‌తో యూజర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే వీడియో కాలింగ్, లొకేషన్ షేరింగ్, యూట్యూబ్ మ్యూజిక్ తదితర ఫీచర్లను తీసుకొచ్చిన స్నాప్‌చాట్‌.. తాజాగా యూట్యూబ్ వీడియోల షేరింగ్ సదుపాయాన్ని కల్పించింది.

సాధారణంగా యూట్యూబ్‌లో మనకు నచ్చిన వీడియోలను ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్‌కు షేర్ చేస్తుంటాం. కానీ ఈ షేరింగ్ ఆప్షన్ ఇదివరకు స్నాప్‌చాట్‌లో లేకపోగా.. ప్రస్తుతం ఆ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు యూట్యూబ్‌లో షేర్ చేయాలనుకుంటున్న వీడియోను ఓపెన్ చేసి, షేర్ బటన్‌పై ప్రెస్ చేయగానే డిస్‌ప్లే ఆప్షన్స్‌లో స్నాప్‌చాట్ కూడా కనిపిస్తుంది. దాన్ని నొక్కగానే కావాల్సిన వీడియో షేర్ అవుతుంది.

ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్స్‌కు అందుబాటులోకి వచ్చిన ఈ ఆప్షన్ ద్వారా వీడియోకు సంబంధించిన థంబ్‌నెయిల్, టైటిల్ సహా చానల్ పేరు కూడా ప్రివ్యూలా మనకు కనిపిస్తుంది. ఇక ఫిబ్రవరిలో స్నాప్‌చాట్ 'లొకేషన్ షేరింగ్' ఫీచర్ తీసుకురాగా.. దీని ద్వారా యూజర్స్ వారి రియల్ టైమ్ లొకేషన్‌ను 15 నిమిషాలు లేదా కొన్ని గంటల పాటు స్నేహితులతో షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇంటికి లేదా బయటకు వెళుతున్నప్పుడు ఈ ఫీచర్ ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని సంస్థ చెబుతుంది..

Tags:    

Similar News