సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల నిరసన!

దిశ, తాండూర్: సింగరేణి సివిక్ కార్మికులను పర్మినెంట్ చేయాలని - Singareni contract workers protest

Update: 2022-03-10 11:23 GMT
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల నిరసన!
  • whatsapp icon

దిశ, తాండూర్: సింగరేణి సివిక్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (ఇఫ్టూ) రీజియన్ నాయకులు బాపు డిమాండ్ చేశారు. తాండూర్ మండలం మాదారం టౌన్షిప్ గురువారం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాదాపు 1100 మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను విస్మరించడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ కోసం పోరాడుతున్నరన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చయ్య, నాందేవ్, తిరుపతి, రవి, చంద్రయ్య, విశ్వనాథ్, రవి, లక్ష్మి, ఒదమ్మ, మల్లీశ్వరి, స్వప్న, యశోద, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News