కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై శ్రేయా ఘోషల్ భావోద్వేగ గీతం.. చప్పట్లు కొట్టద్దంటూ రిక్వెస్ట్

కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఏ రేంజ్‌లో దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-10-21 05:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఏ రేంజ్‌లో దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అయితే తాజాగా స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ తాజాగా ఆర్టీ కర్ వైద్యురాలి ఘటనపై భావోద్వేగ గీతాన్ని పాడారు. గతంలో ఈమె తన కాన్సర్ట్ ను పోస్ట్ పోన్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా దాన్ని ఇప్పుడు ‘ఆల్ హార్ట్స్ టూర్’ లో భాగంగా కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రేయా ఘోషల్ ‘గాయపడిన నా శరీరం బాధను ఈ రోజు వింటున్నారు..’ అంటూ సాగే సాంగ్ ను ఉద్వేగభరింగా పాడి.. కంటతడిపెట్టించింది.

దుర్మార్గుల చేతిలో ఇలాంటి ఘటనల్లో చిక్కుకున్న బాధితులు ఎదుర్కొనే బాధ, తమ ఆవేదనను పాట రూపంలో తెలియజేసింది. శ్రేయా ఘోషల్ సాంగ్ మొత్తం ఆలపించాక.. దయచేసి ఎవరూ చప్పట్లు కొట్టవద్దని కోరింది. దీంతో అక్కడున్న వారంతా వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలు పలికారు. ఈ సింగర్ పాటపై తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేత కునాల్ ఘోష్ స్పందించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. హత్యాచారాల ఘటనలపై నిరసనలు చేయాలని అన్నారు. ఈ ఇష్యూపై శ్రేయా ఎంతో బాధపడ్డారని, ఈవెంట్ ను కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారని తెలిపాడు. ఇప్పుడు మహిళల భద్రతపై పాట పాడి అందరి హృదయాల్ని కదిలించారని వెల్లడించారు. ఈ ఘటన ఒక క్రూరమైన చర్య అని అన్నారు. 


Similar News