హైకోర్టులో ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు షాక్!

Update: 2022-02-11 13:03 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ అశోక్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

దీంతో సీఐడీ అధికారులు అశోక్‌బాబును రిమాండ్‌కు తరలించనున్నారు. ఇకపోతే టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సర్వీస్ లో ఉన్న సమయంలో పదోన్నతి కోసం విద్యార్హతను తప్పుగా చూపించారంటూ ఆరోపణలున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో పని చేసినప్పుడు బీకాం చదవకపోయినా చదివినట్లు తప్పుడు ధృవపత్రం సమర్పించారని విజయవాడకు చెందిన మెహర్ కుమార్ గతంలో అశోక్ బాబుపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.

దీనిపై వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త. సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ ఇటీవల అశోక్ బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేయగా.. గత నెల 25న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. 477 (A ), 466, 467, 468, 471,465,420, R/w 34 IPC సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో గురువారం రాత్రి 11.15 నిముషాలకు అశోక్ బాబును ఇంటి వద్ద సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వివాహ వేడుకకు హాజరైన అశోక్ బాబు రాత్రి సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మఫ్టీలో మాటువేసిన సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అశోక్‌బాబు అరెస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News