వ్యాక్సిన్ ఉత్పత్తి ఆపేసిన సీరం.. అసలు కారణం అదే..
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఎక్కువగా వినియోగించిన కరోనా టీకా కొవిషీల్డ్. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ దీనిని
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఎక్కువగా వినియోగించిన కరోనా టీకా కొవిషీల్డ్. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ దీనిని తయారు చేస్తోంది. అయితే తాజాగా సీరం వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు పేర్కొంది. ఇది వరకే ఆపిన ఉత్పత్తిని ఇప్పుడప్పుడే తిరిగి ప్రారంభించే ఆలోచన లేదని సంస్థ తెలిపింది. ఇప్పటికే దాదాపు 200 మిలియన్ల డోస్‌ల స్టాక్ ఉందని అందుకే ఉత్పత్తిని నిలిపివేశామని అధికారులు తెలిపారు. సీరం అధికారులు మాట్లాడుతూ.. ఉత్పత్తి ఎప్పుడైనా ప్రారంభం కావచ్చని, అది డిమాండ్‌పై ఆధారపడి ఉంటుందని అన్నారు. అయితే సీరం సంస్థ వారు జనవరిలో కొవిషీల్డ్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఏప్రిల్ 10 నుంచి భారత్‌లో 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ ఈ బూస్టర్ డోస్ డ్రైవ్ నత్తనడక నడుస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో అతి తక్కువ కరోనా కేసులు, స్వల్ప ఇన్ఫెక్షన్లు ఇలా చాలానే ఉన్నాయి. దీంతో ఇప్పటికే 200 మిలియన్ డోసులు ఉన్నాయని, మళ్లీ వ్యాక్సిన్‌లు అధిక సంఖ్యలో అవసరం అయితే ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తామని సంస్థ అధికారులు తెలిపారు.