Satyadev: ఊహించని విధంగా వాయిదా పడిన ‘జీబ్రా’ మూవీ.. పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన మేకర్స్

స్టార్ నటుడు సత్యదేవ్(Satyadev) క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. గత కొద్ది రోజులుగా ఆయన హీరోగా మారి పలు చిత్రాల్లో నటించారు.

Update: 2024-10-25 06:05 GMT

దిశ, సినిమా: స్టార్ నటుడు సత్యదేవ్(Satyadev) క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. గత కొద్ది రోజులుగా ఆయన హీరోగా మారి పలు చిత్రాల్లో నటించారు. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా టాలెంట్ నమ్ముకుని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రజెంట్ సత్యదేవ్(Satyadev) నటిస్తున్న తాజా చిత్రం ‘జీబ్రా’(zebra). దీనిని ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాను ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌ఎన్‌ రెడ్డి, బాలసుందరం, దినేష్‌ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఇందులో సత్యదేవ్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్(Priya Bhavani Shankar) నటిస్తుండగా.. పుష్ప ఫేం ధనంజయ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఇప్పటికే మేకర్స్ ‘జీబ్రా’ (zebra)సినిమా అక్టోబర్ 31న దీపావళి(Diwali) కానుకగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటనను రిలీజ్ చేశారు. దీంతో అంతా ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఎవరూ ఊహించని విధంగా ‘జీబ్రా’(zebra) మూవీ వాయిదా పడినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘‘ఈ చిత్రం అక్టోబర్ 31న రావడం లేదు పోస్ట్ పోన్ అయింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాము. ఎక్కువ ఎక్సైట్‌మెంట్, థ్రిల్స్ కోసం వేచిఉండండి’’ అని రాసుకొచ్చారు. కానీ వాయిదా పడటానికి కారణాలేంటో మాత్రం వెల్లడించలేదు, ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. సత్యదేవ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

Tags:    

Similar News